వాస్తవ తెలంగాణపై ఇవాళ బీఆర్ఎస్ స్వేదపత్రం రిలీజ్

వాస్తవ తెలంగాణపై ఇవాళ బీఆర్ఎస్ స్వేదపత్రం రిలీజ్

తెలంగాణలో వాస్తవ పరిస్థితులపై ఇవాళ స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ఇవ్వనున్నారు కేటీఆర్. ఆదివారం ( డిసెంబర్24) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ ఎస్ హయాంలో అవినీతి జరిగిందని.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని.. ప్రాజెక్టులు, విద్యుత్ రంగాల్లో అవినీతి జరిగిందని విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించిన క్రమంలో.. వాస్తవాలను వివరించేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఆవిష్కరిస్తున్నామన్నారు కేటీఆర్. 

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్తానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయం.. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే సహించం అని అని ట్వీట్ చేశారు కేటీఆర్. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని.. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తామన్నారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సంపాదించిన సంపదను ఆవిష్కరింరచేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కేటీఆర్ అన్నారు.