సీఎం రేవంత్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్

సీఎం రేవంత్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్

అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి  బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ఆర్థిక వృద్ధికి అనుకూలమైన వాతావరణం రూపొందించిందని తెలిపారు. 

టీఎస్ ఐపాస్  అనేక విధానాలు తీసుకొచ్చామన్నారు కేటీఆర్. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రైవేట్ రంగాల్లో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. 

మరో వైపు అమెరికాలో  సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. 10 రోజుల  పర్యటన కోసం అమెరికా వెళ్లారు సీఎం. అక్కడ  తెలుగువారు బోకేలతో రేవంత్ కు గ్రాండ్ గా వెల్కం చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుందని తెలంగాణ CMO ట్వీట్ చేసింది. టూర్లో భాగంగా అమెరికా, సౌత్ కొరియాలోని టాప్ కంపెనీలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి.