
హసన్ పర్తి, వెలుగు: వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈనెల 9,10,11 మూడు రోజులు పాటు తమిళనాడులోని మదురై కామరాజు యూనివర్సిటీలో “ విశ్వర్షి వాసిలి వాజ్మయం -దృక్పథాల -ఆవిష్కరణ’ అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇందులో కేయూ తెలుగు విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. కర్రె సదాశివ్ ‘వాసిలి దృక్పథాలు: ఆదర్శ దాంపత్య రహస్యాలు”, డా.చిర్ర రాజు అక్షరాన్ని ఆవాహన చేసుకుంటున్న కవి " వాసిలి " అంశాలపై తమ పత్రాలను సమర్పించనున్నారు.