
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ముంబైలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన మేకర్స్.. తాజాగా హైదరాబాద్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్‌ను వేశారు. ధనుష్, నాగార్జునతో పాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే ధనుష్, నాగార్జున లుక్స్‌ను రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా జిమ్ సర్భ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.