స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌ ఆడలేరు: కుల్దీప్‌‌‌‌

స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌ ఆడలేరు: కుల్దీప్‌‌‌‌

అహ్మదాబాద్‌‌‌‌: తన బౌలింగ్‌‌‌‌లో హై రిస్క్‌‌‌‌ స్వీప్‌‌‌‌ షాట్లు ఆడేటప్పుడు బ్యాటర్ల మైండ్‌‌‌‌లో కన్ఫూజన్‌‌‌‌ వస్తుందని ఇండియా రిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అన్నాడు. అలాంటి టైమ్‌‌‌‌లో తన చేతి నుంచి బాల్‌‌‌‌ విడుదలయ్యేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమన్నాడు. అందుకే ఒకే ఓవర్‌‌‌‌లో ఇఫ్తికార్‌‌‌‌, సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌ వికెట్లు తీయగలిగానని చెప్పాడు.

‘ఇఫ్తికార్‌‌‌‌ కోసం ఎలాంటి ప్రణాళికలు వేయలేదు. లెగ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ మీద బాల్‌‌‌‌ వేయాలని ప్రయత్నించా. కానీ అది గూగ్లీ అయ్యింది. అందులోనూ వికెట్‌‌‌‌కు కాస్త దూరంగా పడింది. ఇలాంటి బాల్‌‌‌‌ను స్వీప్‌‌‌‌ చేయాలంటే చాలా కష్టం. లక్కీగా ఇఫ్తికార్‌‌‌‌ కూడా ఫెయిలయ్యాడు’ అని కుల్దీప్‌‌‌‌ పేర్కొన్నాడు. వాస్తవానికి ఆ ఓవర్‌‌‌‌ తాను వేయాల్సింది కాదన్నాడు. అయితే బ్యాటర్లు ఎక్కువగా స్వీప్‌‌‌‌ చేస్తుండటంతో రోహిత్‌‌‌‌తో మాట్లాడి తాను బౌలింగ్‌‌‌‌కు వచ్చానని చెప్పాడు.