Kumari Aunty: కీర్తి సిల్లీ కామెంట్స్.. కుమారీ ఆంటీ హుందా సమాధానం

Kumari Aunty: కీర్తి సిల్లీ కామెంట్స్.. కుమారీ ఆంటీ హుందా సమాధానం

కుమారి ఆంటీ(Kumari Aunty).. హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె ఇప్పుడు సోషల్ మీడియా స్టార్. ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసిన ఆమె ఫుడ్ వీడియోసే దర్శనమిస్తాయి. అంతలా క్రేజ్ సంపాదించుకున్నారు కుమారి ఆంటీ. ఆ క్రేజ్ తోనే టీవీలో కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న చాలా షోలలో పార్టిసిపేట్ చేశారు కుమారి ఆంటీ. 

ఇదిలా ఉంటే.. ఆమె ఫుడ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె షాప్ కి కస్టమర్ల తాకిడి బాగా పెరిగిపోయింది. అంతకుముందు పదుల సంఖ్యలో వచ్చిన కస్టమర్స్ ఇప్పుడు వదల సంఖ్యలో ఆమె షాప్ వద్దకు వస్తున్నారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా మంది సినిమా సెలబ్రెటీలు సైతం తమ మూవీ ప్రమోషన్స్ కోసం ఆమె దగ్గుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆలాగే ఆమె షాప్ వద్దకు బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ కూడా వెళ్లారు. అక్కడ ఫుడ్ తిన్న తరువాత.. ఆ ఫుడ్ గురించి, టేస్ట్ గురించి చెప్తూ ఓ వీడియో చేశారు.. కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేశామని, అస్సలు బాలేదని, చాలా కారంగా ఉందని, ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని వీడియోలో చెప్పుకొచ్చారు. 

అదే విషయం గురించి కుమారి ఆంటీని అడగగా.. నటి కీర్తి చేసిన వీడియో నేను కూడా చూశానని, ఆరోజే ఫుడ్ నిజంగానే బాగా ఉండకపోవచ్చని, దానికి కారణం నేను ఊళ్ళో లేకపోవడమే అని చెప్పుకొచ్చారు. ఆరోజు వంట మగవాళ్ళు చేశారని, నేను చేసుంటే బాగుండేదని, మగవాళ్ళు చేసే వంటకి.. ఆడవాళ్లు చేసే వంటకి తేడా ఉంటుందని అన్నారు. అంతేకాదు.. తన ఫుడ్ స్టాల్ గురించి కీర్తి అలా మాట్లాడినందుకు తనకు ఎం కోపం లేదని, మల్లి ఒకసారి వచ్చి తన చేతి వంట టేస్ట్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.