కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజనీర్, డిజైనర్: కూనంనేని

కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజనీర్, డిజైనర్: కూనంనేని

హైదరబాద్:  మేడిగడ్డ టూర్ కు మొన్న బీఆర్ఎస్ నేతలు వెళ్లారు... అంతకుముందు ఏం పీకటానికి వెళ్లారు అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.. మీరు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మేడిగడ్డకు వెళ్లిన ఇద్దరు మాజీ మంత్రులు పొంతన లేకుండా ఒక్కొక్కరు ఒక్కో విదంగా మాట్లాడారన్నారు. శనివారం  సోమాజిగూడలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అబద్ధాలు, -కాగ్ చెప్పిన వాస్తవాలపై చర్చ సమావేశం నిర్వహించారు. ఈ చర్చ కార్యక్రమంలో కోదండరామ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి, సీపీఐ పద్మ, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, విద్యావేత్తలు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ..  "కాళేశ్వరం తెలంగాణకు వరమా?.. శాపమా? అనే దానిపై చర్చ జరుగుతోందన్నారు. 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది..రూ.1 లక్ష 45 వేల కోట్ల పైనే. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు, అప్పులు, వడ్డీ ప్రతి ఎటా పెరుగుతుంది.  ప్రాణహిత పూర్తి చేస్తే ఇంత ఖర్చు అయేది కాదు.  కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజనీర్, కాంట్రాక్టర్, డిజైనర్.. సర్వం తానే అనుకున్నాడు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి...ఒకరి పని మరొకరు చేస్తే ఇలాగే ఉంటది. 0 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఉందా?.. ఒక్కరి స్వార్ధ ప్రయోజనం ఉందా తెలియాలి. రాష్ట్ర ప్రయోజనాల ఉండి ఉంటే.. నిపుణులు, ఇంజనీర్లు చెప్పినట్లు వినాలి. వారి సలహా లు తీసుకోవాలి. మేడిగడ్డపై 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. నిపుణులతో చర్చించి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు జాతీయ హోదా  ఎందుకు ఇవ్వలేదు. 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్న కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రాజెక్టుపై100 శాతం బడ్జెట్ ఉంటే.. 25 శాతం కాంట్రాక్టర్ కు.. 25 శాతం రాష్ట్ర పాలకులకు చేరింది. ఖమ్మం జిల్లాలో దుమ్ము గూడెం, ధవళేశ్వరం  ఇలా ఎన్నో కట్టారు ఏళ్ల కింద నిర్మాణం జరిగినవి.. ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి" అని చెప్పారు.