కురవిలో 75 క్వింటాలు నల్లబెల్లం పట్టివేత

కురవిలో 75 క్వింటాలు నల్లబెల్లం పట్టివేత
  • 7.5 క్వింటాళ్ల పటిక  స్వాధీనం

కురవి, వెలుగు: మరిపెడ నుంచి కురవి వైపు నల్లబెల్లం తరలిస్తున్న లారీని పట్టుకుని, నలుగురిని అరెస్ట్ చేసినట్టు కురవి ఎస్సై గోపి తెలిపారు.  మంగళవారం ఉదయం  మహబూబాబాద్ ఎస్పీ ఆదేశాలతో సీసీఎస్, కురవి పోలీసులు అధ్వర్యంలో తనిఖీ లు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా  వచ్చిన లారీలో తనిఖీలు చేశారు. దాంట్లో  75 క్వింటాలు నల్లబెల్లం,7.5 కిలోల పటిక ఉన్నట్టు గుర్తించారు.

  వీటి విలువ సుమారు రూ. 6.75లక్షల  విలువ ఉన్నట్లు తెలిపారు. ఈ నల్లబెల్లం చిత్తూరు  నుంచి కురవి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.అక్రమంగా తరలిస్తున్న గుగులోతు అశోక్, మాలోతు వెంకటేశ్, మారపల్లి విద్యాసాగర్ ను  అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.