ఫారెస్ట్ ఆఫీసర్ల వేధింపులు ఆపాలి..మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన కురుమ సంఘం

ఫారెస్ట్ ఆఫీసర్ల వేధింపులు ఆపాలి..మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన కురుమ సంఘం
  •     మంత్రి వివేక్​ వెంకటస్వామికి కురుమ సంఘం ప్రెసిడెంట్​ వినతి


కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గొర్లు, మేకల కాపరులపై ఫారెస్ట్​ ఆఫీసర్లు వేధింపులకు పాల్పడుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిని జిల్లా కురుమ సంఘం ప్రెసిడెంట్​ గుంట శ్రీశైలం కోరారు. శనివారం హైదరాబాద్​లో మంత్రిని పలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో గొర్లు, మేకలను మేపేందుకు కాపరులకు అడవిలోకి వెళ్లేందుకు పర్మిషన్​ ఇప్పించాలని కోరారు. 

అనుమతి లేకపోవడంతో ఫారెస్ట్​ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. దీంతో స్పందించిన మంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్​ ఆఫీసర్లను ఫోన్​లో ఆదేశించినట్లు శ్రీశైలం తెలిపారు. జిల్లాలో గొల్ల కురుమల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు సీఎం దృష్టికి తీసుకవెళ్లాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. మంత్రిని కలిసినవారిలో కాంగ్రెస్ లీడర్లు మంద తిరుమల్ ​రెడ్డి, వెల్ది సాయి తదితరులున్నారు.