కురుమూర్తి లిఫ్ట్ నీటి విడుదల

కురుమూర్తి లిఫ్ట్ నీటి విడుదల

మదనాపురం, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని శ్రీకురుమూర్తి రాయ లిఫ్ట్  మోటార్లను ఆన్  చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లిఫ్ట్  మరుగున పడిందన్నారు. 

ప్రజా ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన లిఫ్ట్ కు రిపేర్లు చేసి ఆయకట్టుకు సాగ నీటిని అందిస్తోందన్నారు. లిఫ్ట్  ఆయకట్టు​చైర్మన్  రాజవర్ధన్ రెడ్డి, సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్  చైర్మన్లు పల్లెపాగు ప్రశాంత్, కథలప్ప, నాయకులు చుక్క మహేశ్, గొల్ల రాజు, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, మహదేవన్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, వడ్డే రాములు, జగదీశ్, నాగన్న యాదవ్, వెంకట్ నారాయణ, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.