గుంటూరు కారం సినిమాలో నా సీన్స్ కట్ చేశారు : కుషిత కల్లపు

గుంటూరు కారం సినిమాలో నా సీన్స్ కట్ చేశారు  :  కుషిత కల్లపు

సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ కుషిత కల్లపు. అనంతరం పలు సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. ఇప్పటికే చాంగురే బంగారు రాజా, మనోహరం సినిమాలలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలోనూ కుషిత నటించిందట. ఈ మూవీ కోసం నాలుగు రోజులు షూటింగ్ కూడా చేసిందట. కానీ మూవీలో తాను నటించిన సీన్స్ ను తొలగించారట. 

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ కి జోడీగా బాబు నెంబర్ 1 బుల్ షిట్ గయ్ అనే మూవీలో కుషిత నటించింది. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కుషిత ఈ వ్యాఖ్యలు చేసింది. మూవీ చూసిన తర్వాత తన సీన్స్ అన్ని ఎడిటింగ్ లో తొలగించినట్లు తెలుసుకున్నానని తెలిపింది. దీనిపై మూవీ టీంను అడిగితే .సినిమాలన్న తర్వాత ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయని వారు చెప్పినట్లు పేర్కొంది. 

ఇక చేసేదేమీ ఉండదని.. తన సీన్స్ తొలగించడానికి కచ్చితమైన కారణం తెలియదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. మొదట చాలా బాధ పడ్డానని కుషిత వెల్లడించింది. కానీ సినీ పరిశ్రమలో ఇలా జరగడం చాలా కామన్ అని రిలాక్స్ అయ్యాను తెలిపింది.