కువైట్ అగ్ని ప్రమాదం.. భారత బాధితులకు అండగా ఉంటాం : కేంద్రం

కువైట్  అగ్ని ప్రమాదం.. భారత బాధితులకు అండగా ఉంటాం : కేంద్రం

కువైట్ అగ్ని ప్రమాదంలో భారత బాధితులకు అండగా ఉంటామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. కువైట్  అగ్ని ప్రమాదం బాధితులకు అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్  జైశంకర్ . కువైట్ లోని భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తున్నారని ట్వీట్ చేశారు. 

 విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ ఉదయం ఢిల్లీ నుంచి కువైట్ వెళ్లారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామన్నారు. గాయపడ్డ వారికి కువైట్ సర్కార్ ట్రీట్మెంట్ అందిస్తోందని చెప్పారు.
 
కువైట్ లో భారతీయ కార్మికులు ఎక్కువగా ఉన్న అపార్ట్ మెంట్ లో 49 మంది చనిపోయారు. వీరిలో 42 మంది మన దేశానికి చెందిన వారే. మృతుల్లో కేరళకు చెందిన 21 మంది ఉన్నట్టు సమాచారం. మిగిలిన మృతుల్లో పాకిస్థాన్, ఫిలప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ కు చెందిన వారు ఉన్నారు. బిల్డింగ్ లో మొదట కిచెన్ లో ప్రారంభమైన మంటలు.. క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్లు తెలుస్తోంది. కార్మికులు నిద్రలో ఉండటంతో.. భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు.