జుజ్జల్ రావు పేటలో పొలంలో గడ్డి మందు చల్లుతూ కూలీ మృతి

జుజ్జల్ రావు పేటలో పొలంలో గడ్డి మందు చల్లుతూ కూలీ మృతి

కూసుమంచి, వెలుగు:  పొలంలో గడ్డిమందు చల్లుతూ కూలీ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కూసుమంచి మండలం మల్లయ్యగూడెం గ్రామానికి చెందిన మారుతి గోపయ్య(61) తోటి కూలీలతో కలిసి జుజ్జల్ రావుపేట గ్రామానికి చెందిన వెంకటరెడ్డి పొలంలో వరినాట్లు వేయడానికి వెళ్లారు. 

ఆదివారం తోటి కూలీలతో నారు మడిలో గోపయ్య అడుగుమందు చల్లుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడి చనిపోయాడు. కాగా అతడు గుండెపోటుతో చనిపోయినట్లు తోటి కూలీలు చెబుతున్నారు. డెడ్ బాడీని సొంతూరుకు తీసుకెళ్లారు. ఘటనపై ఎస్ఐ నాగరాజును విచారించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.