
శివ్వంపేట, వెలుగు: కరెంట్ షాక్తో కూలీ మృతి చెందిన ఘటన మెదక్జిల్లా శివ్వంపేట మండలం మల్యా తండా శివారులోని ప్రొఫామ్ సీడ్ కంపెనీలోజరిగింది. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. చండి గ్రామానికి చెందిన మల్లేశ్ (50) ప్రొఫామ్ సీడ్ కంపెనీలో ఏడాదిగా కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సీడ్ కంపెనీ సూపర్ వైజర్ నర్సింలు ఫోన్ చేసి కంపెనీలో మోటారు నడవడం లేదు వచ్చి చూడమని చెప్పడంతో వెళ్లాడు. కంపెనీలో ట్రాన్స్ ఫార్మర్ బంద్చేసే క్రమంలోమల్లేశ్కుకరెంట్షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.