
- వరుస ఎన్నికలతో కూలీలు బిజీ
- ఆరు నెలలుగా చేతి నిండా పని
- ఏప్రిల్ , మేలో జడ్పీటీసీ ఎన్నికలు
- మరో రెండు నెలలు ఢోకా లేదు
హైదరాబాద్, వెలుగు: అంతా రెక్కాడితే డొక్కాడని కూలీలు.. పని కోసం అడ్డాల మీద పొద్దున్నుంచే నిలబడి ఉంటరు.. ఎవరొచ్చి పిలుస్తరా అని ఆశగా చూస్తుంటరు.. ఒక్కోసారి సగం కూలైనా దొర్కపోతదా అని మధ్యాహ్నం దాకా ఉంటరు.. కానీ ఆరు నెలలుగా పరిస్థితి మారింది .. పొద్దుపొద్దున్నేఅడ్డాలు ఖాళీ ఐతున్నయ్ .. రోడ్ల మీద కూలీలు కనిపిస్తలేరు.. రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నుంచి ఇప్పటి లోక్‌సభ ఎన్నికల దాకా ర్యాలీలు ,సభలు, ప్రచారమంటూ కూలీలకు మంచిగా పని దొరుకుతోంది .
సెప్టెంబర్ నుంచి
సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దవగా అదే రోజు 105 మంది అభ్యర్థులను టీఆర్‌ఎస్ ప్రకటించింది . అప్పటి నుంచి డిసెంబర్ 11 పొలింగ్ కు రెండు రోజులు ముందు వరకు కూలీలకు పని దొరికింది . తరువాత జనవరిలో గ్రామ పంచాయతీ, ఫిభ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడూ కూలీలకు పని దొరికింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడూ ప్రచారం, సభలంటూ జనసమీకరణ చేస్తున్నారు. మొత్తంగా ఆరు నెలలుగా కూలీలు బిజీబిజీగా ఉంటున్నా రు. జూన్ వరకు జెడ్పీ, మున్సి పల్ ఎన్నికలు ఉండటంతో మరో రెండు నెలలు ఉపాధికి ఢోకా లేదని అంటున్నారు.
తక్కువ పని, ఎక్కువ కూలీ
కూలీకెళ్తే 8 నుం చి 10 గంటలు పనిచేయాలి. మగవాళ్లకు రూ.500 నుంచి 800, మహిళలకు రూ.300నుం చి 500 ఇస్తారు. ఒక్కో కూలీకి ప్రయాణ ఖర్చులు, టిఫిన్, భోజనం, రాత్రికి మందుతో బేరం కుదుర్చుకు ని పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నా రు. ఇప్పుడు ఎండలు పెరగడంతో ఉదయం, సాయంత్రమే లోక్‌సభ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీంతో కూలీలు ఉదయం మూడు, సాయంత్రండు గంటలే ప్రచారానికొస్తున్నారు. కొందరు కూలీలు సభలకైతేనే వస్తామని, ర్యాలీలు, ప్రచారమంటే ఎక్కు వ కూలీ ఇవ్వాలని డిమాం డ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగ పనులు నిదానంగా సాగుతున్నా యని బిల్డర్లు చెబుతున్నా రు. ఏప్రిల్, మే నెలల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ,మున్సి పల్ ఎన్నికలుండటంతో జూన్ నుంచి పనులు ఊపందుకుంటాయని అంటున్నారు.
కేడర్ లేక
గతంలో అన్ని పార్టీలకు గ్రామస్థాయి నుం చి రాష్ట్రస్థాయి వరకు ప్రత్యేకంగా కేడర్ ఉండేది. పార్టీలన్నీఫుల్ టైం కార్యకర్తలను నియమించుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకునేవి. కానీ ఇప్పుడు చాలా పార్టీలు సభలు, సమావేశాలు, ఎన్నికలప్పుడే జనసమీకరణ చేస్తున్నా యి. దీంతో ప్రచారం కోసం కూలీలను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా వరుస ఎన్ని కలతో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది . కూలీల కుటుంబాలకు కడుపు నిండా తిండి దొరుకుతుంది.