టిక్ టాక్: పోలీసులు షురూ చేశారు

టిక్ టాక్: పోలీసులు షురూ చేశారు

సోషల్ నెట్ వర్కింగ్ యాప్  టిక్ టాక్  విపరీతంగా పాపులర్ అయ్యింది. ఆడ, మగ తో పాటు ఏజ్ తో సంబంధం లేకుండా  ఎంతో మంది టిక్ టాక్ కు బానిసలయ్యారు. కొందరు యువతీ యువకులు ఈ పిచ్చిలో పడిపోయి తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. మరి కొందరు తాము చేసే విధులను కూడా పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా చేసిన ఇద్దరు మహిళా పోలీసులు…ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

కడలూరు రిజర్వ్ పోలీసు బెటాలియన్ చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సమీపంలోని బీచ్‌లో ఓ తమిళ పాటకు స్టెప్పులు వేస్తూ టిక్ టాక్ చేశారు. యూనిఫామ్‌లో ఉన్నామన్న సంగతి కూడా మరిచి రొమాంటిక్‌ పాటకు కాలు కదిపారు. లైక్స్‌ కోసం దాన్ని టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాకీ దుస్తుల్లోనే కానిస్టేబుళ్లు స్టెప్పులు వేయటం పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించింది. వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.