కొత్త సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న లైలా

కొత్త సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న లైలా

ఒకప్పుడు సౌత్‌‌లో క్రేజీ హీరోయిన్‌‌గా వెలిగిన లైలా.. పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత కార్తీ ‘సర్దార్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని గురువారం అనౌన్స్‌‌మెంట్ వచ్చింది.  ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘శబ్దం’ చిత్రంలో లైలా ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది.  అరివళగన్‌‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ‘వైశాలి’ తర్వాత  ఆది, అరివళగన్ కాంబినేషన్‌‌లో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు లైలా ఎంట్రీతో ఎక్స్‌‌పెక్టేషన్స్  పెరిగాయి. ఇందులో మునుపెన్నడూ చూడని పాత్రలో లైలా కనిపించబోతోందని ఊరిస్తోంది టీమ్. ఆదికి జంటగా లక్ష్మీ మీనన్ నటిస్తోంది. సెవెన్ జీ ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.