
ఉస్తాద్ రామ్(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). రీసెంట్గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, ఆడియాన్స్ను అట్ట్రాక్ట్ చేసింది.
ఈ నెల (సెప్టెంబర్ 28న) రిలీజ్ కాబోతున్న స్కంద మూవీ చూసేందుకు బుక్ మై షో లో లక్ష మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్కంద రిలీజ్ కు ముందే ఇంతటి గ్రేస్ క్రియేట్ చేస్తుండటంతో..రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు సినీ క్రిటిక్స్. దీంతో ఈ మూవీ..టాలీవుడ్ కలెక్షన్స్ పై పంజా విసిరితే..రామ్ తిరిగి ఫామ్ లోకి రావడం కన్ఫర్మ్. ఇక ఈ క్రేజీ అప్డేట్ తో రామ్.. బోయపాటి ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు.
రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి వారాంతపు హాలీడేస్ వస్తుండటంతో..మేకర్స్ చాలా హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం గాంధీ జయంతి సెలవు, ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు ఇవన్నీ స్కంద మూవీకి కలిసి వస్తాయి. పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తోన్న ఈ మూవీ..ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఇక అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి నుండి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సయిమంజ్రేకర్ కీలక పాత్రలో పోషిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
The excitement and anticipation for the arrival of #Skanda is sky-high?
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 12, 2023
Massive 100K+ Interests on @bookmyshow ❤️?#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️#RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman… pic.twitter.com/rk99PWzoIm