కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం, మంగళవాద్య సేవ, వేద స్వస్తి, మహాగణపతి, గౌరీ పూజ, స్వస్తివాచనం, రక్షాబంధనం, పంచ కలశ స్థాపన, నాంధీ సమారాధన, ఆదిత్యాది నవగ్రహ, దిక్పాలక, సప్తమాతృక, ఏకాదశ రుద్ర, ప్రధాన రుద్ర కలశ స్థాపన ఉపచార పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారికి పంచామృత, ఫల, రస పంచామృతాది ద్రవ్యాలతో ఏకాదశ వార రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్, ఏఈవో శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహా రెడ్డి, ప్రధానార్చకుడు మల్లికార్జున్, ధర్మకర్తలు లింగం, ఎల్లయ్య, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
