ఆగస్టులో మోదీ ప్రభుత్వం పడిపోతది: లాలూ ప్రసాద్ యాదవ్

ఆగస్టులో మోదీ ప్రభుత్వం  పడిపోతది: లాలూ ప్రసాద్ యాదవ్

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని.. ఆగస్టు నాటికి  పడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని  విజ్ఞప్తి చేశారు.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  ఎన్డీయేకు 293, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే..   ఎన్డీయే కూటమిలో టీడీపీకి 16, జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీయే బలం 265 కి పడిపోతుంది. కేంద్రంలో   టీడీపీ, జేడేయూ మద్దతు లేకపోతే  మోదీ ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది.  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 మంది ఎంపీల మద్దతు ఉండాలి. 

ఇక లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో  బీహార్ లోని 40 లోక్ స్థానాల్లో బీజేపీ12, జేడీయూ 12, ఎల్జేపీ5, ఆర్జేడీ 4, కాంగ్రెస్ 3, సీపీఐ(ఎం) 2,  ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.