లాలూ ప్రసాద్ యాదవ్ కు 6వేల జరిమానా

లాలూ ప్రసాద్ యాదవ్ కు 6వేల జరిమానా

13ఏళ్ల నాటి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఊరట దక్కింది. ఆ కేసులో లాలూను నిర్ధోషిగా ప్రకటిస్తూ జార్ఖాండ్ లోని పాలము కోర్టు తీర్పునిచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లోని పాలము కోర్టుకు హాజరయ్యారు.  ఈ కేసులో కోర్టు ఆయనకు 6వేల జరిమానా విధించి..ఇకపై కోర్టుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2009 జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలము జిల్లాలోని గర్వా అసెంబ్లీ స్థానం నుండి అర్జేడీ తరపున గిరినాథ్ సింగ్ పోటీకి దిగారు. ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం చేయడానికి హెలికాఫ్టర్ లో గర్వా చేరుకున్నారు. అక్కడి గోవింద్ హైస్కూల్ లో ఆయన ఎన్నికల సమావేశం జరగనుంది. కాగా హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కోసం కళ్యాణ్ పూర్ లో హెలిప్యాడ్ నిర్మించారు. అయితే హెలికాఫ్టర్ హెలిప్యాడ్ లో దిగకుండా గోవింద హైస్కూల్ మైదానంలోని సభాస్థలంలో ల్యాండ్ అయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం లాలూపై కేసు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో ఆయనకు కోర్టు 6వేల జరిమాన విధించి కోర్టుకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది.