త్వరలో 100 పడకల ఆస్పత్రి ... చెన్నూరు రూపురేఖలు మారుస్తా. : మంత్రి వివేక్ వెంకటస్వామి

త్వరలో  100 పడకల ఆస్పత్రి ...  చెన్నూరు రూపురేఖలు మారుస్తా. : మంత్రి వివేక్ వెంకటస్వామి

త్వరలో చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. చెన్నూరు రూపురేఖలు మారుస్తానని చెప్పిన.. చేస్తానని అన్నారు  వివేక్. చెన్నూరు పట్టణంలో  ఏటీసీ నిర్మాణానికి మంత్రులు వివేక్, జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రి వివేక్..నిధులు ఉన్నాయి కాబట్టే ధైర్యంగా భూమిపూజలు చేస్తున్నాం. కొత్త కోర్సులు నేర్పించేందుకే ఏటీసీ సెంటర్లను ప్రారంభించాం. రూ.40 కోట్ల పనులు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పదేండ్లలో  నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఏం చేసింది.?. నాలాలు, రోడ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మిషన్ భగీరథపేరుతో రూ.62 వేల కోట్లు బీఆర్ఎస్ మింగింది.

ప్రతి నిరుపేదకు ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది.  చెన్నూరు ప్రజలకు వైద్య సేవలు మరింత  చేరువ చేస్తాం.  రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నాం. పవర్ ప్లాంట్ నిర్మాణంలో కొత్త ఉద్యోగాలొస్తాయి. చెన్నూరులో వడ్డీ లేని రుణాలు రూ.76 లక్షలు ఇచ్చాం. చెన్నూరు నియోజకవర్గంలో మహిళలకు పెట్రోల్ బంక్ మంజూరు అయ్యింది. చెన్నూరులో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాం. 

 చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో 250 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుంది . చెన్నూరు లోని 50 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని మే నెలలో ప్రారంభం చేసుకుందాము.

జైపూర్ లో 1200 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం .ఫిబ్రవరిలో 850 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు . పవర్ ప్లాంట్ పనులు పూర్తి అయితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి .రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. చెన్నూరు పట్టణంలో మంచి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తాం అని మంత్రి వివేక్ అన్నారు.