సీసీఎల్ఏ వెబ్​సైట్‌‌‌‌లో ల్యాండ్ ​డేటా గాయబ్

సీసీఎల్ఏ వెబ్​సైట్‌‌‌‌లో ల్యాండ్ ​డేటా గాయబ్
  • ఆర్వోఆర్, 1బీ, పహాణీ, పెండింగ్​సర్వే నంబర్లు,అమెండ్మెంట్ రిజిస్టర్​ తొలగింపు
  • ధరణి పోర్టల్​లోనూ కనిపించని ఈ రికార్డులు సర్కారు తీరుపై అనుమానాలు

హైదరాబాద్, వెలుగు:  సీసీఎల్ఏ వెబ్ సైట్ లో వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక సమాచారం మాయమైంది. ఇటీవల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్​కు ధరణి పోర్టల్ ను ప్రారంభించిన ప్రభుత్వం..  సీసీఎల్ఏ వెబ్ సైట్ లో  ఇన్నాళ్లూ ప్రజలకు కనిపించిన భూముల సమగ్ర వివరాలను హఠాత్తుగా తీసేసింది. సీసీఎల్ఏ వెబ్ సైట్​ఓపెన్​ చేయగానే  ‘నో యువర్​ ల్యాండ్ స్టేటస్​’ అనే ఆప్షన్ లో కనిపించే 1బీ, పహాణీ, పెండిగ్​సర్వే నంబర్లు, అమెండ్మెంట్​రిజిస్టర్ ​ప్రస్తుతం కనిపించట్లేదు. ఇన్నాళ్లూ పబ్లిక్​ డొమైన్ లో ఉన్న ఈ వివరాలను తొలగించడంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ పరెన్సీ గురించి పదేపదే చెప్పే సర్కారు.. అందరికీ అందుబాటులో ఉన్న పాత రికార్డులను తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏడింటిలో రెండు విభాగాలు తొలగింపు

సీసీఎల్ఏ వెబ్ సైట్ లోని నో యువర్ ల్యాండ్​స్టేటస్​ఆప్షన్ పై క్లిక్​చేస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్​(ఆర్వోఆర్)​, భూముల నక్షలు(కాడస్ట్రల్​ మ్యాప్స్)​, రిజిస్ట్రేషన్​డీడ్స్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్​పేమెంట్ వివరాలు, రెవెన్యూ కోర్టు కేసుల డేటా, సివిల్ కోర్టు కేసుల డేటా, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్​సెర్చ్(సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు) లాంటి ఏడు విభాగాలు కనిపించేవి. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎక్కడి నుంచైనా ఈ సమాచారం యాక్సె్స్ లో ఉండేది. అయితే ఈ ఏడింటిలో వ్యవసాయ భూములకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిన రికార్డ్ ఆఫ్ రైట్స్​(ఆర్వోఆర్​)​, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్​ సెర్చ్​ విభాగాలను ప్రభుత్వం తొలగించింది. దీంతో రెవెన్యూ రికార్డుల్లో కీలకమైన ఆర్వోఆర్​అండ్ 1బీ, పహణీ, అమెండ్మెంట్​రిజిస్టర్ సీసీఎల్ఏ వెబ్ సైట్ లో కనిపించడం లేదు.

పెండింగ్ సర్వే నంబర్ల తొలగింపు

భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి వివాదాలు లేని 1.55 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు రాష్ట్ర ప్రభుత్వం 60,95,134 పట్టాదారు పాస్​ పుస్తకాలు జారీ చేసింది. ఇవి కాకుండా భూమి ఓనర్ షిప్​ విషయంలో ఏదైనా వివాదం ఉంటే పార్ట్​ బీలో చేర్చి ఆ సర్వే నంబర్లను పెండింగ్​లో పెట్టారు. ఇలాంటి సర్వే నంబర్లన్నీ గ్రామాలవారీగా సీసీఎల్ఏ వెబ్ సైట్ లోని సర్వే నంబర్​పెండింగ్​ఫర్​ క్లియరెన్స్ కేటగిరీలో కనిపించేవి. ప్రస్తుతం ఈ కేటగిరీ కూడా కనిపించడం లేదు. దీంతో గ్రామాలవారీగా పాస్​ పుస్తకాలు జారీ కాని సర్వే నంబర్లను తెలుసుకునే చాన్స్​లేకుండా పోయింది. పెండింగ్​సర్వే నంబర్లు గ్రామానికి 200 నుంచి 500 చొప్పున,  రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల వరకు ఉంటాయని అంచనా.

ధరణి కంటే సీసీఎల్ఏ వెబ్ సైట్ బెటర్​

సీసీఎల్ఏ వెబ్ సైట్ తో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం  తీసుకొచ్చిన ధరణి పోర్టల్​లో భూముల సమాచారం అరకొరగానే ఉంది. కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన భూముల సమాచారాన్నే అందుబాటులో ఉంచారు. ల్యాండ్​డిటైల్స్​సెర్చ్​లో వివరాలు ఎంటర్​ చేస్తే కేవలం పట్టాదారు పేరు, తండ్రి పేరు, భూమి విస్తీర్ణం, మార్కెట్ వ్యాల్యూ మాత్రమే వస్తున్నాయి. ఎన్​కంబ్రెన్స్​డిటైల్స్​అనే ఆప్షన్ పై క్లిక్​చేస్తే ఏ సమాచారం రావడం లేదు. ధరణి కంటే సీసీఎల్ఏ వెబ్ సైట్ లోనే వివరాలు సమగ్రంగా ఉండేవని.. పబ్లిక్​ డొమైన్ నుంచి ఈ సమాచారాన్ని తొలగించడాన్ని రెవెన్యూ ఉద్యోగులు, భూచట్టాల నిపుణులు తప్పుబడుతున్నారు. ఒకే రికార్డు పేరిట భూములకు సంబంధించినపాత రికార్డులన్నింటినీ మాయం చేసే కుట్ర కనిపిస్తోందని ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు.

భూమి వివరాలెట్ల తెలుసుకోవాలి?

వన్ బీ రికార్డులో సర్వే నంబర్, మొత్తం భూమి విస్తీర్ణం, సాగుకు పనికొచ్చే భూమి, యజమాని పేరు, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం మొదలైన వివరాలు ఉంటాయి. పహాణీలో 1 బీ వివరాలతోపాటు జలాధారం, ఖాతా నంబర్, ఆధార్​సీడింగ్, డిజిటల్ సైన్​వివరాలు ఉంటాయి. అమెం డ్మెంట్​ రిజిస్టర్ లో సర్వే నంబర్, భూమి విస్తీర్ణం, విక్రయదారు పేరు, కొనుగోలుదారు పేరు, మ్యుటేషన్​ చేసిన తేదీ, తహసీల్దార్​ డిజిటల్​సైన్​చేసిన తేదీ ఉంటాయి. ఈ అమెండ్మెంట్​ రిజిస్టర్​ద్వారా భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అనే వివరాలు ప్రజలె వరైనా తెలుసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయింది.