ఖాళీ భూమి కనిపిస్తే చాలు పట్టా సృష్టించి..

ఖాళీ భూమి కనిపిస్తే చాలు పట్టా సృష్టించి..
  • ఖాళీ భూమి కనిపిస్తే చాలు పట్టా సృష్టించి.. కొనిపించి మోసం చేస్తాడు
  • పోలీసు విచారణలో నిందితుడు ఆదినారాయణమూర్తి బండారం బట్టబయలు
  • ఇప్పటికే పలుకేసుల్లో అరెస్టయి కోర్టు చుట్టూ తిరుగుతున్నదందా ఆపని నిందితుడు
  • ఐదుగురితో ముఠా ఏర్పాటు చేసి రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ దందాలు
  • 264 నకిలీ డాక్యుమెంట్లు , మహబూబ్ నగర్ MRO, RDOల పేరుతో  9 రెవెన్యూ స్టాంప్స్ , శీళ్లు
  • 51 పట్టా దారు పాస్ బుక్కులు స్వాధీనం
  • నకిలీ పత్రాలతో భూమలమ్ముతున్న ముఠాపై మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉంది: సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్: రాజధాని చుట్టూ.. ఎక్కడైనా ఖాళీ భూమి కనిపిస్తే చాలు ఆ భూమి తాలూకు నకిలీ పట్టా సృష్టించి.. అమాయకులతో కొనిపించి మోసం చేసి చేతులెత్తేస్తాడు.. ఒకరిద్దరు కాదు అనేక మందిని ఇదే తరహాలో మోసం చేస్తున్న నిందితుడు ఏకంగా 9 రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టినా ఖాతరు చేయడం లేదు.  తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో ఆధారాలు సేకరింన పోలీసులు నిందితుడు ఆదినారాయణమూర్తిని అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఆదినారాయణమూర్తి బండారం బట్టబయలైంది. ఐదుగురితో ముఠా ఏర్పాటు చేసి రాజధాని చుట్టూ, జిల్లాల్లోనూ దందాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా వద్ద 264 నకిలీ డాక్యుమెంట్లు , మహబూబ్ నగర్ MRO, RDOల పేరుతో  9 రెవెన్యూ స్టాంప్స్ , శీళ్లు, 51 పట్టా దారు పాస్ బుక్కులు దొరికాయి. ఈ డాక్యుమెంట్లు అన్నీ గందరగోళంగా ఉన్నాయని.. వీరి వద్ద భూములు కొన్న వారెవరైనా ఉంటే చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారంటే ఎంత పకడ్బందీగా మోసం చేస్తున్నారో అర్థం అవుతుంది. 
శుక్రవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ ముఠాను అరెస్టు చేసిన సందర్బంగా మీడియా సమావేశం నిర్వహించారు. నకిలీ పత్రాలు సృష్టించి వాటి ద్వారా భూములమ్మి మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠాను అరెస్ట్ చేశామని, వీరిని విచారించే దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ గ్యాంగ్ సభ్యులు ఖాళీ భూములను ఓనర్స్ కి తెలియకుండా డాక్యుమెంట్లు నకిలీ సృష్టియించి  అమ్మకాలు చేస్తున్నారు. ల్యాండ్ ఓనర్స్ తో సంప్రదింపులు అయ్యిపోయాయి కాబట్టి మీరు కొనుగోలు చేయవచ్చు అని నమ్మించి అంటగడుతున్నారు. ఇదే కోవలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలో 40 ఎకరాల భూమిని చూపించి, ఈ భూమి కి ఒప్పందం అయ్యిందని ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తి బాధితుడు నుండి 8.5 కోట్లు రూపాయలు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశారు. అగ్రిమెంట్ చేయాలని ఆదినారాయణ మూర్తి పై ఒత్తిడి తేవడం తో ఫేక్ పత్రాలతో మరోసారి మోసం చేశారు ల్యాండ్ తన పేరు మీద చేసినట్లు మొబైల్ కి ఒక నకిలీ పత్రాల్ని పంపించారు. ఒరిజినల్ పేపర్లు కావాలని బాధితుడు మరింత ఒత్తిడి తెచ్చి  SR ఆఫీస్ కి వెళ్లగా భాదితుడు దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్ని కూడా నకిలీవి అని తెలింది.

దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. 40 ఎకరాల భూమికి ఎకరం 1.4 కోట్లు రూపాయలు ఒప్పందం ప్రకారం 56 కోట్లు రూపాయాలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నామని వాపోయాడు. అన్నీ నకిలీ పత్రాలు చూపిస్తూ వెళుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బలమైన ఆధారాలు లభించడంతో ఆదినారాయణమూర్తితోపాటు అతని ఆధ్వర్యంలోని ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరి వద్ద 264 నకిలీ డాక్యుమెంట్లు , మహబూబ్ నగర్ MRO RDO పేరుతో  9 రెవెన్యూ స్టాంప్స్ , ప్రభుత్వ గజిటెడ్ అధికారులు, సంస్థల శీళ్లు దొరికాయి. 51 పట్టాదారు పాస్ బుక్కులను స్వాధీనం చేసుకున్నామని, ఆదినారాయణ మూర్తి తో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఆదినారాయణ మూర్తి కి 9 రియల్ ఎస్టేట్  కంపెనీలు ఉన్నట్లు విచారణ లో తేలిందన్నారు.  వీరి వద్ద భారీ ఎత్తున లభించిన నకిలీ డాక్యుమెంట్లు చూస్తుంటే.. చాలా మందిని మోసం చేసినట్లు కనిపిస్తోందన్నారు. వీరి వద్ద భూములు కొన్న వారు.. లేదా లావాదేవీలు నిర్వహించిన వారు చెక్ చేసుకోవాలని సజ్జనార్ సూచించారు.