36% పెరిగిన ఎల్​ అండ్​ టీ లాభం.. క్యూ1 లో రూ. 3,116 కోట్లు

36% పెరిగిన ఎల్​ అండ్​ టీ లాభం..  క్యూ1 లో రూ. 3,116 కోట్లు

    
న్యూఢిల్లీ: ఎల్​ అండ్​ టీ కన్సాలిడేటెడ్​ నికర లాభం జూన్​2023 క్వార్టర్లో 36 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 3,116 కోట్లకు చేరింది. ఈ ఏడాది క్యూ 1 లో ఆదాయం కూడా 49,028 కోట్లకు ఎగసింది. అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లో రెవెన్యూ రూ. 36,548 కోట్లు మాత్రమే. రూ. 10 వేల కోట్లతో షేర్ల బైబ్యాక్​ ప్రపోజల్‌‌కు డైరెక్టర్ల బోర్డు ఓకే చెప్పింది. ఈ ప్రపోజల్​కు షేర్​ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. 

ఒక్కో షేర్‌‌‌‌కు రూ. 6 చొప్పున స్పెషల్​ డివిడెండ్​ చెల్లింపును కూడా డైరెక్టర్ల బోర్డు రికమెండ్​ చేసింది. కంపెనీ చేతిలోని మిగులు డబ్బును షేర్​హోల్డర్లకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని, అంతకు ముందు పెట్టుకున్న  స్ట్రాటజిక్​ ప్లాన్‌‌లో ఇదొక ముఖ్యమైన అంశమని సీఈఓ ఎస్ఎన్​ సుబ్రమణియన్​ చెప్పారు. ఇండియాలో క్యాపెక్స్​ బూమ్​ఎదుగుదలకు సాయపడుతోందని, అదే విధంగా గల్ఫ్​ కో–ఆపరేషన్​ కౌన్సిల్​ ప్రాజెక్టులు కూడా కంపెనీకి మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సర్వీసెస్​ బిజినెస్​ బాగా నడుస్తోందని అన్నారు.

కొత్త ఆర్డర్లు

పవర్​ ట్రాన్స్​మిషన్​, డిస్ట్రిబ్యూషన్​ రంగాలలో ఎల్​ అండ్​ టీ కంపెనీకి కొత్త ఆర్డర్లు వచ్చాయి. ఇండియాలో స్కాడా, డీఎంఎస్​, సంబంధిత ఐటీ ఇన్​ఫ్రా ప్రాజెక్టు గుజరాత్​లో దొరికిందని, జార్ఖండ్​లో 400 కేవీ డబుల్​ సర్క్యూట్​ ట్రాన్స్​మిషన్​ లైన్​ ఏర్పాటు ఆర్డరు కూడా వచ్చిందని ఎల్ అండ్​ టీ వెల్లడించింది. ఇక మిడిల్​ ఈస్ట్​లో హై ఓల్టేజ్​ డైరెక్ట్​ కరెంట్​ ట్రాన్స్​మిషన్​ సెగ్మెంట్లోనూ ఒక ఆర్డరు లభించినట్లు పేర్కొంది.