రామ కొండకు పోటెత్తిన భక్తజనం

రామ కొండకు పోటెత్తిన భక్తజనం

మహబూబ్​నగర్ ​జిల్లా కోయిలకొండలోని కొండల్లో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కోనేటిలో స్నానాలు చేసి, ఆ నీటిని బాటిళల్లో నింపుకొని ఇండ్లకు తీసుకువెళ్లారు. కొండపై దొరికే ఏ చెట్టు ఆకు అయినా మహత్యం కలిగి ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే కొండపై దొరికే ఆకులు, మొక్కలను కూడా పట్టుకెళ్లారు. ఇండ్ల గుమ్మాలపై ఉంచితే దోషం ఉండదని వారి విశ్వాసం.
- వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్​నగర్