
అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పెద్దపులి పర్యాటకులను కనువిందు చేసింది. ఇటీవల టైగర్ సఫారీలో టూరిస్ట్ లు సఫారీ వెహికల్ లో ఏటీఆర్లో పర్యటించారు. వరహాబాద్ సమీపంలో సఫారీ వెహికల్ కు అడ్డుగా పెద్దపులి రావడంతో టూరిస్ట్ లు ఆందోళనకు గురయ్యారు. చెట్టు వద్ద ఆగి, రోడ్డుపై మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న పులిని వారు వీడియో తీశారు. పెద్దపులి కనిపించడంతో ఆనందంతో పాటు భయపడ్డామని వారు చెప్పారు. వారు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.