ప్రపంచంలోనే పెద్ద ఆర్​ఈ స్టోరేజ్​

ప్రపంచంలోనే పెద్ద ఆర్​ఈ స్టోరేజ్​
  • ప్రపంచంలోనే పెద్ద ఆర్​ఈ స్టోరేజ్​ 
  • ప్లాంట్​ పెడుతున్న గ్రీన్​కో
  • కర్నూల్​ వద్ద 23,246 కోట్లతో ఏర్పాటు


హైదరాబాద్​, వెలుగు: రెన్యువబుల్​ ఎనర్జీ రంగంలోని గ్రీన్​కో ఆంధ్ర ప్రదేశ్​లోని కర్నూల్​ వద్ద అతి పెద్ద స్టోరేజ్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తోంది. రూ. 23,246 కోట్ల  (మూడు బిలియన్​ డాలర్ల)  ఖర్చుతో ఈ రెన్యువబుల్​ ఎనర్జీ స్టోరేజ్​ ప్లాంట్​ను పెడుతున్నట్లు గ్రీన్​కో జాయింట్​ ఎండీ మహేష్​ కొల్లి వెల్లడించారు. 5,230 మెగావాట్ల సామర్ధ్యముండే స్టోరేజ్​ ప్లాంట్​ ప్రాజెక్టులో 1000 మెగావాట్లకు సరిపడేలా ఆర్సిలర్​ మిట్టల్​ 600 మిలియన్​ డాలర్లు వెచ్చిస్తోందని చెప్పారు. కర్నూల్​ వద్ద ఈ ప్రాజెక్టుకు ఆంధ్ర ప్రదేశ్​ సీఎం  జగన్​మోహన్​ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. 2023 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ కొత్త ప్రాజెక్టుతో స్టోరేజ్​లో తాము ముందడుగు వేసినట్లవుతుందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఇది సాధ్యమైందని గ్రీన్​కో గ్రూప్​ సీఈఓ అనిల్​ చలమలశెట్టి చెప్పారు.