కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ కాల్చివేత

 కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ కాల్చివేత

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఓ ఆర్మీ ఆఫీసర్ తో పాటు చాలా మంది మరణాలకు కారణమైన లష్కరే తాయిబా టెర్రరిస్టును భద్రతా దళాలు శుక్రవారం మట్టుబెట్టాయి. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని ఛోటిగామ్ గ్రామంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీరిని గమనించిన టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించగా.. సోల్జర్లు తిప్పికొట్టారు. ఈ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో లష్కరే తాయిబాకు చెందిన బిలాల్ అహ్మద్ భట్ ను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

గతంలో ఓ టీమ్​కు సారథ్యం వహించిన ఆర్మీ అధికారి ఉమర్ ఫయాజ్‌‌‌‌‌‌‌‌ను చంపడంతోపాటు, అనేక మందిని బలిగొన్న కేసుల్లో భట్​ప్రమేయం ఉంది. కాశ్మీరీ పండిట్ సునీల్ కుమార్ భట్ హత్యలో కూడా ఈ టెర్రరిస్ట్​హస్తం ఉంది. “భట్ స్థానికంగా 12 మంది యువకులను టెర్రరిస్టులుగా మార్చాడు. అనేక నేరాలతో అతనికి సంబంధం ఉంది. 2022లో నౌగామ్‌‌‌‌‌‌‌‌లో కార్డన్​సెర్చ్​ఆపరేషన్​ చేస్తున్న ఆర్మీ అధికారి ప్రాణాలు బలిగొన్నాడు”
అని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.