TGSRTC ఎండీగా చివరిరోజు..ఆర్టీసీ బస్లో ప్రయాణించిన వీసీ సజ్జనార్

TGSRTC ఎండీగా చివరిరోజు..ఆర్టీసీ బస్లో ప్రయాణించిన వీసీ సజ్జనార్

హైదరాబాద్​: టీజీఎస్​ఆర్టీసీ ఎండీగా చివరిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు వీసీ సజ్జనార్. ప్రజారవాణాతో తన అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. TGSRTCఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 

సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపూల్​లోని టెలిఫోన్​ భవన్​ బస్టాండునుంచి బస్​భవన్​ వరకు 131I/M రూట్​ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్​ చేసి కండక్టర్ దగ్గర టికెట్​ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. 

హైదరాబాద్​ నగర పోలీస్​ కమిషనర్​ గా వీసీ సజ్జనార్​ బదిలీ అయిన విషయం తెలిసిందే.. ఇవాళ్టితో TGSRTC ఎండీగా ఆయన విధులు చివరిరోజు కావడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

ALSO READ : పంచాయతీ కార్యదర్శులకు రూ. 104 కోట్లు రిలీజ్