LasyaNanditha: లాస్య అకాల మరణం ఎంతో బాధాకరం: మాజీ మంత్రి హరీశ్ రావు

LasyaNanditha: లాస్య  అకాల మరణం ఎంతో బాధాకరం: మాజీ మంత్రి హరీశ్ రావు

ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం హరీష్ రావు అమేద హాస్పిటల్ కు చేరుకొని లాస్య నందిత భౌతికకాయాన్ని సందర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. లాస్య మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంటోన్మెంట్ ఏరియాలోని కార్ఖాన గృహ లక్ష్మి కాలనీ ఆమె ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఆమె భౌతికకాయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు.