లేటరల్‌‌‌‌ ఎంట్రీ ఇన్‌‌‌‌టూ పాలిటెక్నిక్‌‌‌‌ 

లేటరల్‌‌‌‌ ఎంట్రీ ఇన్‌‌‌‌టూ పాలిటెక్నిక్‌‌‌‌ 

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి 2023–-24 విద్యా సంవత్సరానికి ‘లేటరల్‌‌‌‌ ఎంట్రీ ఇన్‌‌‌‌టూ పాలిటెక్నిక్‌‌‌‌ కామన్‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ (ఎల్‌‌‌‌పీసెట్‌‌‌‌) నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్/ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌(ప్రభుత్వ/ ఎయిడెడ్‌‌‌‌/ అన్‌‌‌‌ఎయిడెడ్‌‌‌‌/ ప్రైవేట్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ కళాశాలలు)ల్లో  రెండో సంవత్సరం డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.

అర్హత: కనీసం 60 % మార్కులతో ఐటీఐ కోర్సు ఉత్తీర్ణత. డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్ అండ్ ట్రైనింగ్ నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలి.

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌‌‌‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, టెక్స్‌‌‌‌టైల్ టెక్నాలజీ.

దరఖాస్తులు: ఏప్రిల్​ 20 వరకు ఆప్లై చేయాలి. మే 22న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు  www.sbtet.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.