Vietnam floods: వియత్నాంలో వరదల బీభత్సం..నీటమునిగిన వేలాది ఇళ్లు..36కు చేరిన మృతుల సంఖ్య

Vietnam floods: వియత్నాంలో వరదల బీభత్సం..నీటమునిగిన వేలాది ఇళ్లు..36కు చేరిన మృతుల సంఖ్య

వియత్నాం అంతటా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆ దేశాన్ని  అతలాకుతలం చేశయి. 40 ఏళ్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధ్య వియత్నాంలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వరదల సంభవించి 35 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. ముఖ్యంగా వియత్నాంలోని తీరప్రాంత ప్రావిన్సులను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1.7 మీటర్లు (5 అడుగుల 6 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. ఇది 4 దశాబ్దాలలో అత్యంత భారీ వర్షపాతం.

వియత్నాం మధ్యభాగంలోని థువా థియెన్ హ్యూ, క్వాంగ్ నామ్, డా నాంగ్ వంటి ప్రాంతాలు ఈ భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. కొండప్రాంతాల్లో మట్టి చరియలు, తీరప్రాంతాల్లో వరదలు చోటుచేసుకున్నాయి. రహదారులు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. హ్యూ, డా నాంగ్, లామ్ డాంగ్ ,క్వాంగ్ ట్రై ప్రావిన్సులలో అధికంగా ప్రజలు మృత్యువాతపడ్డారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, చారిత్రాత్మక పురాతన పట్టణం హెూయ్ అన్ లో నడుము లోతు వరద నీటిలో మునిగిపోయింది. స్థానిక ప్రజలు చెక్క పడవల ద్వారా వీధుల్లో ప్రయాణించాల్సి ఉంది. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగింది. 

వరదలపై వియత్నాం ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. బలగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. ప్రజలకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు.  ఆహారం, త్రాగునీరు, ఔషధాలు అందించారు.