కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. 2026 అక్టోబర్ 22 (గురువారం) నాగిరెడ్డిపేట్ మండలంలో వెంకంపల్లి గ్రామ శివారులో చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సాయంత్రం వెంకంపల్లి గ్రామంలో నీళ్ల ట్యాంకు దగ్గర రాళ్ల మీద చిరుతపులి సేద తీరుతుండటంతో స్థానికులు చూసేందుకు గుమిగూడారు. భయంభయంతోనే విజువల్స్ ని సెల్ ఫోన్ లో బంధించారు. మండలంలో వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో చిరుత పులి సంచారం వీడియో వైరల్ గా మారింది.
ALSO READ : 25 కేజీల HMT రైస్ బ్యాగ్ కొంటున్నారా..?
చిరుత గ్రామ శివారులోనే మాటు వేసి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు చిరుతను పట్టుకుని కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
