కొత్త ట్రెండ్: మెరిసే చర్మం కోసం స్కిన్ ఫాస్టింగ్

కొత్త ట్రెండ్: మెరిసే చర్మం కోసం స్కిన్ ఫాస్టింగ్
బ్యూటీ వరల్డ్​కి కొత్తగా ఇంట్రడ్యూస్​ అయిన ట్రెండ్ స్కిన్​ ఫాస్టింగ్. ఇప్పుడు సోషల్​ మీడియాలో  హాట్ టాపిక్​ కూడా. మెరిసే చర్మం కోసం  నెలలు తరబడి ఈ  స్కిన్​ ఫాస్టింగ్​  ఫాలో అయిపోతున్నారు  చాలామంది. నార్మల్​ ఫాస్టింగ్​ తెలుసు.. కానీ, స్కిన్​ ఫాస్టింగ్ ఎలా చేయాలనేగా డౌట్​.  దీనికి కొన్ని రూల్స్​ ఉన్నాయి. అందానికి మెరుగులు దిద్దడానికి  వారానికో  బ్యూటీ ప్రొడక్ట్​ రిలీజ్​ అవుతోంది మార్కెట్​లో. వాటన్నింటికి కొన్నాళ్లు  బ్రేక్​ ఇవ్వడమే స్కిన్​ ఫాస్టింగ్. దీన్ని జపాన్​కి చెందిన ‘మిరాయి క్లినికల్​ బాడీకేర్’​  అనే  స్కిన్​కేర్​ కంపెనీ  ఇంట్రడ్యూస్​ చేసింది. రిజల్ట్​ బాగుండటంతో ఇప్పుడు వరల్డ్​ వైడ్​ ఫేమస్​ అయింది ఈ ఫాస్టింగ్ టెక్నిక్​. దీన్ని ఓ నెలరోజుల పాటు చేస్తే చర్మ ఆరోగ్యం, అందం రెట్టింపు అవుతుంది. బ్రీతింగ్ అవసరం స్కిన్​కి బ్రీతింగ్ అవసరం. కానీ, డిఫరెంట్ క్రీమ్స్, లోషన్స్​​,  కామెడోజెనిక్​తో నిండిన  ప్రొడక్ట్స్​తో స్కిన్​ని ​ కవర్​ చేయడం వల్ల దానికి  సరిపడా బ్రీతింగ్​ అందదు . దాంతో  చర్మంపై పోర్స్​  బ్లాక్​ అవుతాయి.  దానివల్ల యాక్నే, డార్క్​ సర్కిల్స్​ లాంటి సమస్యలొస్తాయి. స్కిన్​ సహజ తేమని కూడా కోల్పోతుంది. ఆ సమస్యలకి ఫుల్​ స్టాప్​ పెట్టడానికి  కనీసం వారానికికొకసారైనా స్కిన్​ ఫాస్టింగ్ తప్పదంటున్నారు  మిరాయి  క్లినికల్​ బాడీ కేర్​ ఫౌండర్​ కోకో హయాషి. స్కిన్​  ఫాస్టింగ్ వల్ల చర్మానికి బ్రీతింగ్ సరిగా అందడమే కాకుండా నేచురల్​ ఆయిల్స్​ని స్వయంగా చర్మమే ఉత్పత్తి చేసుకుంటుంది. అంతేకాదు చర్మంపై తేమ ఎక్కువసేపు నిలుస్తుంది.  కేవలం స్కిన్​ కండిషన్​ని మెరుగుపరచడమే కాదు చర్మంపై మలినాల్ని కూడా తొలగిస్తుంది ఈ ఫాస్టింగ్ అంటోంది ఆమె. ఆలోచించాల్సిందే ఒక్కొక్కరి స్కిన్​ ఒక్కోలా ఉంటుంది. అలాంటప్పుడు అన్నింటికీ ఒకే ట్రీట్​మెంట్ సెట్​ అవ్వదు. అందుకే ఈ స్కిన్​ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఇది మన స్కిన్​కి ఎంతమేర పనికొస్తుందో ఆలోచించాల్సిందే అంటున్నారు డెర్మటాలజిస్టులు. ఒకవేళ  చర్మానికి ఆల్​రెడీ వాడుతున్న ప్రొడక్ట్స్​ మంచి రిజల్ట్స్​ ఇస్తుంటే స్కిన్​ ఫాస్టింగ్​కి దూరంగా ఉండటమే బెటర్​ అంటున్నారు. అలాగే స్కిన్​ ఫాస్టింగ్ చేసేటప్పుడు  సన్​స్ర్కీన్​లోషన్, క్లెన్సర్​ వాడటం మానేయొద్దు. వీటిని డైలీ రొటీన్​ నుంచి ఎలిమినేట్​ చేస్తే దుమ్మంతా చర్మంపై నేరుగా పడుతుంది, సూర్య కిరణాలు చర్మంపై పడి స్కిన్​ మరింత  డ్యామేజ్​ అవుతుంది. ​ అందుకే ఫాస్టింగ్​ స్కిన్​ ఫాస్టింగ్ మెయిన్​ గోల్స్​లో ఒకటి మన చర్మానికి ఏ ప్రొడక్ట్​ ​ సూట్​ అవుతుందో తెలుసుకోవడమే. చాలామంది మార్కెట్​లో దొరికే కొన్ని క్రీములు  వాడుతుంటారు. అది పడకపోతే మరొకటి అదీ కాదంటే ఇంకొటీ. కానీ, అలా రెగ్యులర్​గా డిఫరెంట్ ఫార్ములాస్​ ఉన్న  ప్రొడక్ట్స్​ని వాడటం వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంది. అందుకే కొన్ని రోజులు స్కిన్​ ఫాస్టింగ్ చేస్తే చర్మం నేచురల్​ స్టేజ్​కి వస్తుంది.  ఆ స్టేజ్​లో మన చర్మానికి ఏ ప్రొడక్ట్​ సూట్​ అవుతుందో తెలుసుకోవడం తేలికవుతుంది. దాన్ని బట్టి ఏదో ఒక ప్రొడక్ట్​కి పర్మినెంట్​గా స్టిక్​ అయిపోవచ్చు. దూరంగా ఉండాల్సిందే.. స్కిన్​ ఫాస్టింగ్​ వారం నుంచి పదిరోజులతో మొదలుపెట్టి నెలవరకు చేయొచ్చు. యాక్నే సమస్యలున్న  వాళ్లు ఈ ఫాస్టింగ్​కి దూరంగానే ఉండాలి. అలాగే అలర్జీలకు సంబంధించిన ప్రొడక్ట్స్​ వాడుతున్న వాళ్లు  కూడా స్కిన్​ ఫాస్టింగ్​ని అవాయిడ్​ చేయాలి.  ఆ ఆ ప్రొడక్ట్స్​కి బ్రేక్​ ఇచ్చి స్కిన్​ ఫాస్టింగ్  చేస్తే చర్మ ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశాలు ఎక్కువ.