IPL Ticket Chaos: నిమిషాల్లోనే.. హాట్ కేకుల్లా అమ్ముడైన RCB, MI మ్యాచ్ టికెట్లు.. ఒక్కొక్కటి రూ. లక్ష

IPL Ticket Chaos: నిమిషాల్లోనే.. హాట్ కేకుల్లా అమ్ముడైన RCB, MI మ్యాచ్ టికెట్లు.. ఒక్కొక్కటి రూ. లక్ష

IPL Ticket Chaos: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న వేళ, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కంటే అసహనమే ఎక్కువగా కనిపిస్తోంది. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లేకపోవడం, అధిక ధరలతో సామాన్య క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల హోమ్ మ్యాచ్‌ల టికెట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నిమిషాల్లోనే సోల్డ్ అవుట్: 
మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆర్‌సీబీ తమ హోమ్ మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైన నిమిషం లోపే టికెట్లన్నీ అమ్ముడపోయినట్లు అధికారిక వెబ్‌సైట్లో చూపించాయి. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఆన్‌లైన్ లో వేచి చూస్తుండగానే టికెట్లు మాయమైపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అధికారిక వెబ్‌సైట్లలో టికెట్లు లేవని వస్తున్నా.. థర్డ్ పార్టీ సైట్లలో మాత్రం వందల సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ధరలు అసలు ధర కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

Also Read :  21 ఏళ్లకే క్రికెట్కి గుడ్ బై.. ఆర్సీబీ కొత్త చైర్మన్గా ఆర్యమన్ బిర్లా

బ్లాక్ మార్కెట్లో ధరలు:
ప్రస్తుతం రీసేల్ వెబ్‌సైట్లలో టికెట్ల ధరలు: 
-* ముంబై వర్సెస్ కేకేఆర్: ప్రారంభ ధర రూ. 6,500 నుంచి ప్రారంభమై రూ. 50  వేల వరకు పలుకుతోంది.
* ముంబై వర్సెస్ ఆర్సీబీ: అత్యంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ టికెట్లు రూ. 15 వేల నుంచి మొదలై ఏకంగా  ఒక లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

ఆగ్రహంలో అభిమానులు: 
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అభిమానుల భావోద్వేగాల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని క్రికెట్ ప్రేమికులు ఫైర్ అవుతున్నారు. సామాన్య అభిమానులు గంటల తరబడి లోడింగ్ స్క్రీన్ల వైపు చూస్తుంటే, అధిక ధర చెల్లించే వారికి మాత్రం ఈజీగా టికెట్లు దొరుకుతున్నాయి. టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో ఫ్రాంచైజీలు, అభిమానుల మధ్య ఉండాల్సిన నమ్మకం పూర్తిగా దెబ్బతింటోంది.