Aryaman Birla: 21 ఏళ్లకే క్రికెట్కి గుడ్ బై.. ఆర్సీబీ కొత్త చైర్మన్గా ఆర్యమన్ బిర్లా.. ఎలా సాధ్యమైందంటే!

Aryaman Birla: 21 ఏళ్లకే క్రికెట్కి గుడ్ బై.. ఆర్సీబీ కొత్త చైర్మన్గా ఆర్యమన్ బిర్లా.. ఎలా సాధ్యమైందంటే!

Aryaman Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీమ్స్ లో ఒకటైన ఆర్సీబీ జట్టు చేతులు మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలోని కన్సార్టియం సుమారు 1.78 బిలియన్ డాలర్ల (రూ.16 వేల కోట్లకు)కి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. బ్రిటన్‌కు చెందిన డయాజియో అనుబంధ సంస్థ 'యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్' నుంచి ఆర్సీబీ 100 శాతం వాటాను ఈ కన్సార్టియం దక్కించుకుంది. ఈ భారీ ఒప్పందంతో ఐపీఎల్ జట్ల విలువ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. 

ఈ మార్పు తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఆర్యమన్ బిర్లా కేవలం వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే కాదు.. అతడికి క్రికెట్‌తో సంబంధం కూడా ఉంది. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఆర్యమన్ కి ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్ టీమ్ పై సెంచరీ చేసిన చరిత్ర అతడి పేరిట నమోదైంది. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి గతంలో అతడు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. 

ఆర్సీబీ కొత్త ఛైర్మన్ ఆర్యమన్ బిర్లా ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడ్ని రూ.30 లక్షలకు దక్కించుకుంది. కానీ అప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు.. దీంతో 2020లో తీవ్ర మానసిక ఒత్తిడితో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతం ఇస్తూ తనను తాను అర్థం చేసుకోవడానికి ఆ బ్రేక్ తీసుకున్న ఆర్యమన్ బిర్లా.. ఇప్పుడు తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా ఓ ఐపీఎల్ జట్టుని కొనుగోలు చేసి అధిపతిగా తిరిగి వచ్చాడు.  

ఆర్సీబీ జట్టు కొనుగోలులో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్డ్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ పార్టనర్స్ గా ఉన్నాయి. క్రీడలు, మీడియా, వ్యాపార రంగాలలో ఉన్న అనుభవంతో ఆర్సీబీని ప్రపంచస్థాయిలో నెంబర్ వన్ గా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్సీబీ ఎదుగుదలలో భాగస్వామి కావడం తన అదృష్టమని ఆర్యమన్ బిర్లా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు.