7.95 శాతం రిటర్న్ ఇచ్చే బీఓఐ ఎఫ్‌‌‌‌డీ స్కీమ్ లాంచ్‌‌‌‌

7.95 శాతం రిటర్న్ ఇచ్చే బీఓఐ ఎఫ్‌‌‌‌డీ స్కీమ్ లాంచ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)  666 రోజుల కాల పరిమితిపై ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను లాంచ్ చేసింది. సూపర్ సీనియర్ సిటిజెన్స్‌‌‌‌కు (80 ఏళ్ల కంటే పైనున్న వారు)  ఏడాదికి 7.95 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌‌‌‌డీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ‘666 డేస్‌‌‌‌– ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌’ స్కీమ్‌‌‌‌ కింద ఎఫ్‌‌‌‌డీలు చేసే సీనియర్ సిటిజెన్స్ (60–80 ఏళ్ల మధ్య  ఉన్నవారు) ఏడాదికి 7.80 శాతం వడ్డీ పొందొచ్చని, మిగిలిన వారు 7.30 శాతం పొందొచ్చని  బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  

డొమెస్టిక్‌‌‌‌, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఓ, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈ రూపీ టెర్మ్‌‌‌‌ డిపాజిట్లకు  సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.  జూన్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లపై లోన్లు పొందొచ్చని, మెచ్యూరిటీ కాకముందే విత్‌‌‌‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.  ‘666 డేస్‌‌‌‌–ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌’ స్కీమ్‌‌‌‌ను బ్యాంక్ బ్రాంచ్‌‌‌‌ లేదా బీఓఐ యాప్‌‌‌‌ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌‌‌ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు.