జేఈఈ లేకుండానే  ట్రిపుల్​ఐటీలో బీటెక్​

జేఈఈ లేకుండానే  ట్రిపుల్​ఐటీలో బీటెక్​

హైదరాబాద్​లోని ఇంటర్నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ(ఐఐఐటీహెచ్​) స్పెషల్​ చానెల్​ ఆఫ్​ అడ్మిషన్​ పోర్టల్​ ప్రారంభించింది. జేఈఈ మెయిన్​ లేకుండానే టాలెంట్​ ఉన్న స్టూడెంట్స్​కు ఇంటర్​ అర్హతతో రెండు బీటెక్​ కోర్సుల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తోంది. అర్హులైన స్టూడెంట్స్​ సబ్జెక్ట్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​, ఇంటర్వ్యూలో మెరిట్​ సాధించి ప్రతిష్టాత్మక ఇన్​స్టిట్యూట్​లో బీటెక్​ చేయొచ్చు. 
బీటెక్​ ప్రోగ్రామ్స్​: ఎలక్ట్రానిక్స్​ & కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​(ఈసీఈ), కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్​(సీఎస్​ఈ)

సీట్లు: ఒక్కో ప్రోగ్రామ్​లో 10 సీట్లు ఉంటాయి.

అర్హతలు:  మ్యాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులతో జులై 2021 నాటికి ఇంటర్మీడియట్​/తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు సీబీఎస్​ఈ ఉడాన్​ స్కీమ్​ క్వాలిఫై అయి ఉండాలి/జవహర్​ నవోదయలో ఇంటర్​ పూర్తి చేసి ఉండాలి/ టెన్త్​ తర్వాత ఇంటిగ్రేటెడ్​ బీటెక్​లో ఫోర్త్​ సెమిస్టర్​లో ఎన్​రోలై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థులకు 60 నిమిషాలకు కంప్యూటర్​ బేస్డ్ సబ్జెక్ట్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ నిర్వహిస్తారు.​ షార్ట్​ లిస్ట్​ చేసి  ఇంటర్వ్యూకు పిలిచి మెరిట్​ ఆధారంగా అడ్మిషన్​ కేటాయిస్తారు. 
సిలబస్​: ఇంటర్మీడియట్​ స్థాయిలో ఫిజిక్స్​, మ్యాథ్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు సీబీఎస్​ఈతోపాటు స్టేట్​ సిలబస్​ చదువుకోవాల్సి ఉంటుంది.​ 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో
అప్లికేషన్​ పోర్టల్​ క్లోజింగ్​ తేది: మే 10
ఎగ్జామ్​ తేది: జూన్​ 2
అప్లికేషన్​ ఫీజు: రూ.500
వెబ్​సైట్​: ugadmissions.iiit.ac.in