రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. సెప్టెంబర్ 6న రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. ముంబైలోని ఒకే ప్లాట్ లో రాజ్ తరుణ్ మల్హోత్రాతో కలిసి ఉండగా పట్టుకుంది లావణ్య. రాజ్ తరుణ్ ను తనకు అప్పగించాలని మాల్వితో గొడవకు దిగింది లావణ్య. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనను మోసం చేసి హీరోయిన్ మాల్వీతో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తుంది. ముంబైలోని ఓ ప్లాట్ లో ఉంటున్నారనే సమాచారంతో తన తండ్రితో కలిసి అక్కడికి వెళ్లి రాజ్ తరుణ్, మాల్విని పట్టుకుంది లావణ్య. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు.