మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఈయనే

మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఈయనే

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఎంగేజ్మెంట్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 9న మెగా సోదరుడు నాగ బాబు(Nagababu) ఇంట్లో ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. అతి కొద్దీ మంది సమక్షంలో జరిగిన ఈ వేడుకకు.. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి(Chiranjeevi),సురేఖ(Surekha),పవన్ కళ్యాణ్(Pawan kalyan) రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana),అల్లు అర్జున్(Allu Arjun), స్నేహ(Allu Sneha) తదితరులు హాజరయ్యారు.

అయితే తాజాగా మెగా కుటుంబానికి కాబోయే వియ్యకుండు ఇతడే అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 18 ఫాథర్స్ డే సందర్బంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది లావణ్య త్రిపాఠి.. "ఇతరులకు సేవ చేయాలనే ఆయన అభిరుచి నాకు స్ఫూర్తినిచ్చింది. ఎప్పుడూ మా నిర్ణయాలకు మద్దతిస్తూ  మమ్మల్ని సరైన దిశలో నడిపిస్తారు" అని రాసుకొచ్చింది. దానికి ఎంగేజ్మెంట్ లో తన తండ్రితో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. 

ఇది చూసిన నెటిజన్స్ మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఇతనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎంగేజ్మెంట్ తరువాత లావణ్య చేసిన మొదటి పోస్ట్ కావడంతో.. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.