
పదకొండేళ్ల క్రితం హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. సుమారుగా ఓ ఇరవై సినిమాల్లో నటించింది. గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్‌తో ప్రేమలో ఉన్న ఆమె, త్వరలోనే తనని పెళ్లి చేసుకుని మెగాఫ్యామిలీకి కోడలు అవబోతోంది. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. లావణ్య తన కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది లావణ్య. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తోంది. ‘స్కై ల్యాబ్’ ఫేమ్ విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘బ్యాక్ టు వర్క్’ అంటూ షూటింగ్ లొకేషన్ నుండి ఓ షార్ట్ వీడియోను సోషల్ మీడియా స్టేటస్‌లో పోస్ట్ చేసింది లావణ్య. మరోవైపు ఓ కొత్త దర్శకుడితో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ ఆమె లీడ్ రోల్ చేస్తోంది. ఇక తమిళంలో అథర్వకి జంటగా ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. ప్రస్తుతానికి వరుస షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంది లావణ్య.