కొత్త జీవోలు తెచ్చి ఖజానా నింపుకుంటున్న‌డు

కొత్త జీవోలు తెచ్చి ఖజానా నింపుకుంటున్న‌డు

హైదరాబాద్: జీవో నంబర్ 131 (ఎల్ ఆర్ ఎస్)ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ఎల్బీనగర్ బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా కాలంలో కర్కశంగా వ్యవహరిస్తూ రెవెన్యూశాఖ లో మార్పుల పేరుతో ప్రజల నడ్డి విరిచే జీవోలు తెచ్చి ప్రజా ధనాన్ని కొల్లగొట్టచూస్తున్నారని ఎల్బీనగర్ బీజేపీ కన్వీనర్ వంగ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పేద,మధ్య తరగతికి గుదిబండలామారనున్న ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఎల్బీనగర్ నగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ పోకడకు ఇదే నిదర్శనమని, ప్రజా సంక్షేమం మరచి సంక్షోభంలోకి నెట్టేందుకు కొత్త జీవోలు తెచ్చి ఖజానా నింపుకుని సమస్యలు గాలికి వదిలేసారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిన్నారం డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ మహేశ్వర రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రమేష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.