LB స్టేడియంలో సీఎం KCR మీటింగ్ క్యాన్సిల్

LB స్టేడియంలో సీఎం KCR మీటింగ్ క్యాన్సిల్

మిర్యాలగూడలో బహిరంగ సభ తర్వాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఐతే… కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు కావడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

నల్గొండ జిల్లా నుంచి ఎల్బీ స్టేడియానికి రావడానికి తనకు మరో 2 గంటల టైమ్ పడుతుందని … ఆలస్యం అవుతుంది కాబట్టి సభను నాయకులు నిర్వహించి ముగించాలని సీఎం కోరినట్టు తలసాని వివరించారు. లక్షల సంఖ్యలో జనం స్టేడియంలో ఎదురుచూస్తున్నారని తాను సీఎంను కోరినట్టుగా వివరించారు. ఐతే.. తాను రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని… మరోసారి హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహిద్దామని… నాయకులు మాట్లాడి సభను ముగించాలని సీఎం కోరినట్టు వివరించారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎదురుచూస్తున్న ప్రజలు, కార్యకర్తలు , మీడియా ప్రతినిధులు అన్యధా భావించొద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సీఎం సూచనతో మరోసారి హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.