లండన్: భారత సంతతి లీడర్ రిషి శునక్ బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఓటింగ్ లో ఆయన ఓటు షేరు 115 నుంచి 118కి చేరింది. ప్రధాని పదవి దక్కాలంటే శునక్కు ఇంకా 2 ఓట్లు మాత్రమే దక్కాల్సి ఉంది. ప్రధాని రేసులో 92 ఓట్లతో వాణిజ్య శాఖా మంత్రి పెన్సీ మోర్డౌంట్ 2వ స్థానంలో, 86 ఓట్లతో విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రుస్ 3వ స్థానంలో కొనసాగుతున్నారు. 120 ఓట్లు వస్తే ప్రధాని పదవితోపాటు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం పగ్గాలు కూడా రిషి శునక్ చేతికే అందుతాయి. నాలుగవ రౌండ్ ఓట్లతో రిషి శునక్ ఫైనల్ 2 నిలవడం ఖాయమైంది. బుధవారం చివరి రౌండ్ ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత తమ సొంత కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు దేశమంతటా ప్రచారం నిర్వహిస్తారు.
