నోట్​బుక్స్తో మంత్రి సబితకు విషెస్​

నోట్​బుక్స్తో  మంత్రి సబితకు విషెస్​

పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాల స్థానంలో నోట్​ బుక్స్​ ఇవ్వాలని పిలుపునిచ్చారు. న్యూ ఇయర్​ విషెస్​ చెప్పేందుకు వచ్చిన నేతలు, పలువురు అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నోట్​ పుస్తకాలు అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గ నేతలతో పాటు,జిల్లాల నుండి వచ్చిన నాయకులు,అధికారులు మంత్రికి బొకేలు,శాలువాల స్థానంలో నోట్ పుస్తకాలు అందజేశారు. 

నూతన సంవత్సరం సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు బొకేలు,శాలువలు తీసుకురావొద్దనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపులో భాగంగా శ్రీనగర్ కాలనీతో పాటు,మీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో  మంత్రిని కలిసిన నేతలు నోట్ పుస్తకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తన పిలుపుకు స్పందించి ముందుకు వచ్చిన అందరికి సబితా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నేతలు అందజేసే పుస్తకాలు పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరు ఇదే విధానాన్ని పాటించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు,అంగన్ వాడి పిల్లలకు అవసరం అయ్యే వాటిని ఇవ్వటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, తనతో పాటు ఎవరిని కలిసినా ఇదే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని కోరారు.తనకు వచ్చిన నోట్ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు అందిస్తామని మంత్రి తెలిపారు.