
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వాడకూడని పదాల జాబితా పుస్తకాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రిలీజ్ చేసింది. ఎవరైనా సభ్యులు ఈ పదాలు వాడితే వాటిని పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. సభ్యుల నుంచి సరైన వివరణ, స్పందన లేకుంటే వాళ్లను సభ నుంచి బయటకి పంపిస్తారు.ఇక ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కాగ.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. అన్ పార్లమెంటరీ పదాల పేదల పేరుతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతి పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్ పార్లమెంట్ నేతలు జైరాం రమేశ్, డెరెక్ ఓబ్రెయిన్, రణ్ దీప్ సూర్జేవాలా, ప్రియాంక చతుర్వేది తదితరులు ఈ చర్యని తీవ్రంగా ఖండించారు.
ప్రతి పక్ష ఎంపీలపై ఇప్పటికే కాగ్ ను ప్రయోగించిందన్న వారు... ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేసేందుకు... అసభ్య పదజాలం పేరుతో ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు కుట్రలు పన్నుతోందని ఫైర్ అయ్యారు. ప్రజల కోసం పోరాడేందుకు వచ్చే సమావేశాల్లో ఆ పదాలను ఉపయోగిస్తామని, వీలైతే తమను సభ నుంచి సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు.