కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ దృష్టిలో పడేందుకు నేతల ఆరాటం

కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ దృష్టిలో పడేందుకు నేతల ఆరాటం

రాజ్యసభ కోసం అసెంబ్లీకి క్యూ

ఉదయం 10 గంటల నుంచే లాబీల్లో ఎదురుచూపులు

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసిన పొంగులేటి, సీతారాం, నగేశ్, సుధారాణి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి కదా. వాటిపై ఆశలు పెట్టుకున్న నేతలు.. ఆ సీటు కోసం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు ట్రై చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ మొదలవడంతో అక్కడికి క్యూ కట్టారు. ఉదయం 10 గంటల నుంచే లాబీల్లోకి నేతల తాకిడి మొదలైంది. అయితే ‘షెడ్యూలు బిజీగా ఉంది. అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ కష్టం’ అని  సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పడంతో చాంబర్ నుంచి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బయటికెళ్లేటప్పుడు ఆయన దృష్టిలో పడేందుకు నేతలు ఆరాటపడ్డారు. సీఎం ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిపోయాక కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి చాన్స్ ఇవ్వమని కోరారు. సభ నుంచి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ బయటకు వచ్చే వరకు మాజీ ఎంపీ గుండు సుధారాణి లాబీల్లో వెయిట్ చేసి కలిశారు. ‘రాజ్యసభ సీటు కావాలని సీఎంను అడిగా. ఇప్పటికే కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి  చెప్పా. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. అయినా అవకాశం కోసం వేచి చూడక తప్పదు’ అని ఆమె కామెంట్ చేశారు. మాజీ ఎంపీలు నగేశ్, సీతారాం నాయక్ కూడా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిశారు. అలాగే నిజామాబాద్ లోకల్ బాడీ కోటాలోని ఎమ్మెల్సీ సీటు తమకివ్వాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ కోరారు.

వ్యాపారవేత్తలకు చాన్స్ లేదు: పొంగులేటి

రాజ్యసభ సీటు తనకు తప్పకుండా వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ధీమాగా ఉన్నారు. ‘కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిశా. రోజూ ఆయనతో టచ్‌‌‌‌‌‌‌‌లో ఉంటా. నిర్ణయం పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉంటదని నమ్మకముంది’ అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి హెటిరో ఫార్మా అధినేత పార్థసారథిరెడ్డి కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ‘వ్యాపారవేత్తలకు చాన్స్ ఉండదు. అలా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడం లేదు’ అని చెప్పారు.

ఆదివాసులకు సీటివ్వాలి

రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి ఆదివాసులకివ్వాలని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు సీతారాంనాయక్, నగేశ్ లాబీల్లోకి వచ్చారు. ఇద్దరిలో ఎవరికి సీటొస్తుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘లంబాడీలకు మంత్రి పదవి, ఎంపీ పదవి ఉంది. అదివాసులకేం లేవు.ఈసారి రాజ్యసభ మాకివ్వాలి’ అని నగేశ్ అన్నారు. వెంటనే సీతారాం స్పందిస్తూ..‘సార్ మనసులో ఏముందో, ఆయనేం ఆలోచిస్తుండో ఎవ్వరికీ తెల్వదు’ అన్నారు.

For More News..

బీహార్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’

ఈసారి బడ్జెట్ ​1.55 లక్షల కోట్లు!