ఇదెక్కడి న్యాయం.. కేటీఆర్‌కు అనసూయ ట్వీట్ 

ఇదెక్కడి న్యాయం.. కేటీఆర్‌కు అనసూయ ట్వీట్ 

హైదరాబాద్: చిన్నారుల భద్రత విషయంలో కొన్ని స్కూళ్లు అనుసరిస్తున్న తీరుపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ సీరియస్ అయ్యారు. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో తిరిగి స్కూళ్లను తెరిచారు. అయితే భద్రతా ప్రమాణాల విషయంలో భయపడుతున్న చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై అనసూయ స్పందించారు. చిన్నారుల భద్రత విషయంలో పాఠశాలలు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్‌కు ఆమె ట్వీట్ చేశారు. 

కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్‌ను అనుసరించామని.. కేసులు తగ్గాక లాక్‌డౌన్ తొలగించారని అనసూయ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా ముందుకెళ్తోందని.. అయితే చిన్నారులకు టీకా లేదన్నారు. అలాంటప్పుడు క్లాసులకు హాజరవ్వాలని పిల్లల తల్లిదండ్రులను స్కూళ్ల యాజమాన్యాలు ఎందుకు ఒత్తిడి చేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. 

‘డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసి పిల్లల్ని తరగతులకు పంపాలని పేరెంట్స్‌‌ను బలవంతం చేస్తున్నారు. అంటే ఒకవేళ స్కూళ్లలో ఉన్నప్పుడు పిల్లలకు ఏమైనా అయినా దానికి వాళ్లు బాధ్యులు కాదనేగా అర్థం. చెప్పండి సార్. ఇదెంత వరకు సమంజసం. మీరు ఎప్పటిలాగే మమ్మల్ని గైడ్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అనసూయ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తల కోసం: 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

ఇకపై ఢిల్లీ దాదాగిరి నడవదు: మమతా బెనర్జీ

ఫేస్‎బుక్‎ పేరు మార్పు