కెనాల్ కు గండి... స్కూల్ ఆవరణలోకి చేరిన నీరు

కెనాల్ కు గండి... స్కూల్ ఆవరణలోకి చేరిన నీరు

ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ శివారులో ఎస్సారెస్పీ కెనాల్ కు గండి పడింది. దీంతో నాలుగు రోజులుగా నీళ్లు పంట చేల మీదుగా స్కూల్ ఆవరణలోకి చేరాయి. స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెనాల్ కు గండి పడిన విషయాన్ని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే గండి పూడ్చి రైతులు, స్టూడెంట్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.